హైదరాబాద్‌లో బీజేపీ నాయకులతో కలిసి జరిగిన భేటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేస్తూ కార్పొరేటర్లరా విప్‌కు భయపడి ఓటింగ్‌కు దూరమైనా, మజ్లిస్‌కు ఓటేసి నా మీ రాజకీయ భవిష్యత్తు ఖతమేనని అని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ తీసుకున్న నిర్ణయంపైనా, ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ పైనా బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండేది, ఓటింగ్ ను బహిష్కరించేది నక్సలైట్లు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల విప్‌లకు భయపడి ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, మజ్లిస్ పార్టీని గెలిపించినా ఆయా పార్టీల కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తు ఖతం కాబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణలోని 85 శాతం హిందువులంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
విప్ లకు భయపడి నిర్ణయం తీసుకుంటారో, ఓటింగ్ కు హాజరై మజ్లిస్ ను ఓడిస్తారో తేల్చుకోవాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కా ర్పొరేటర్లకు సూచించారు. హిందువుల మనోభావాలను వివరించి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావును గెలిపించాలని కోరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్ రావు, మాజీ ఎమ్యెల్సీ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

More Stories
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కోసం ఎదురుచూపు!
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు: