
* చైనా మినహా మిగతా దేశాలపై 90 రోజులు ఆపేసిన అమెరికా
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా ట్రేడ్ వార్‌లో ఢీ అంటే ఢీ అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన టారిఫ్ వార్‌ను చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. డ్రాగన్ దేశం నుంచి వచ్చే వస్తువులపై అమెరికా 104 శాతం సుంకం విధించగా, అమెరికా ఉత్పత్తులపై తాము 84 శాతం సుంకం విధిస్తున్నామని చైనా తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 10 నూతన టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని డ్రాగన్ కూడా నిర్ణయించింది. దీంతో ఆగ్రహించిన ట్రంప్, ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకుంటే అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానని హెచ్చరించారు.
మరోవంక, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశారు. చైనా మినహా అన్ని దేశాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. చైనాపై మాత్రం వెంటనే పెంచిన సుంకాలు అమల్లోకి రాగా.. తాజా సవరింపులతో డ్రాగన్‌పై ప్రతీకార సుంకాలు గరిష్టంగా 125 శాతానికి చేరడం గమనార్హం.
ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడం వల్ల తాను చెప్పినట్లుగానే గతంలో విధించిన 54 శాతానికి అదనంగా 50 శాతం జోడించారు. ఫలితంగా చైనాపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి. దీంతో అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని చైనా ఆరోపించింది. ప్రతిగా మరో 50 శాతం సుంకాలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
ట్రంప్ వాణిజ్య చర్యలకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడుతామని పేర్కొంది. సుంకాల పెంపుపై అమెరికాతో చర్చించడానికి ఇప్పటి వరకు చైనా ఆసక్తి చూపలేదు. కొన్ని దేశాలు అమెరికాతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అమెరికా గౌరవం, సమస్యలను పరిష్కరించుకునేందుకు సమాన సహకారం అందించేందుకు సంసిద్ధంగా లేకపోతే చర్చల ప్రసక్తే ఉండదని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అధిక సుంకాలు విధిస్తున్న అమెరికా తీరుపై చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)కు ఫిర్యాదు చేసింది. చైనాపై విధిస్తున్న సుంకాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని అనిశ్చితిలోకి నెడుతాయని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డిర్ లేయన్‌తో జరిగిన ఫోన్ కాల్‌లో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ స్పష్టం చేశారు. సుంకాల పేరుతో అమెరికా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా తమ ఆర్థిక విధానాలను రూపొందించినట్లు తెలిపారు.
ముఖ్యంగా ట్రంప్ మొదటి పదవీకాలంలో చేసుకున్న వాణిజ్య ఒప్పందంలోని వాగ్దానాలను అమెరికా ఉల్లంఘిస్తోందని చైనా ఆరోపిస్తోంది. చైనీస్ పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్‌ని విక్రయించకపోతే టిక్‌టాక్‌ను నిషేధిస్తామని ఇటీవల చేసిన అమెరికా చట్టాన్ని తప్పుబట్టింది. ఇరు దేశాలు ఏదైనా టెక్నాలజీని అప్పగించమని మరొకరిపై ఒత్తిడి చేయకూడదని చేసిన ఒప్పందానికి విరుద్ధమని చైనా చెబుతోంది.
ముఖ్యంగా ట్రంప్ మొదటి పదవీకాలంలో చేసుకున్న వాణిజ్య ఒప్పందంలోని వాగ్దానాలను అమెరికా ఉల్లంఘిస్తోందని చైనా ఆరోపిస్తోంది. చైనీస్ పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్‌ని విక్రయించకపోతే టిక్‌టాక్‌ను నిషేధిస్తామని ఇటీవల చేసిన అమెరికా చట్టాన్ని తప్పుబట్టింది. ఇరు దేశాలు ఏదైనా టెక్నాలజీని అప్పగించమని మరొకరిపై ఒత్తిడి చేయకూడదని చేసిన ఒప్పందానికి విరుద్ధమని చైనా చెబుతోంది.
చైనా బాటలోనే కెనడా కూడా తాజాగా కొరఢా ఝులిపించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వాహనాలు, వాటి పరికరాలపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. యుఎస్ నుంచి ఆ దేశం ప్రతీ ఏడాది 67వేల యూనిట్ల వాహనాలను దిగుమతి చేసుకుంటుంది.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్