
యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. దాంతో రేవంత్ సర్కారుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనల జోరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) అట్టుడుకుతున్నది. పదుల సంఖ్యలో జేసీబీలు, వందలాది మంది పోలీసుల బందోబస్తుతో హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమి నిండిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి యూనివర్సిటీలోని పచ్చని చెట్లను బుల్డోజర్లు కూకటివేళ్లతో పెకిలించి వేస్తున్నాయి.
విలువైన ఔషధ మొక్కలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. అరుదైన పక్షులు, జంతువులు బిక్కుబిక్కుమంటూ పరుగులు పెడుతూ హాహాకారాలు చేస్తున్నాయి. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోండి రాహుల్‌గాంధీ’ అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం డజన్ల కొద్దీ బుల్డోజర్లతో హెచ్‌సీయూ భూముల్లో విధ్వంసం సఅష్టిస్తున్నది. వెంటనే వాటిని ఆపాలి. ఈ పోరాటంలో తన మద్దతు హెచ్‌సీయూ విద్యార్థులకే’ అని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి లిసిప్రియా కంగుజమ్ పోస్టు చేశారు.
‘హెచ్‌సీయూ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపితే వాళ్లను అరెస్టుచేయడం ఘోరం’ అని టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఖండించారు. ‘పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం జీవవైవిధ్యం గల భూమిని కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరితే, కోర్టు విచారణ పూర్తికాకముందే జేసీబీలతో విధ్వంసం చేస్తున్నారు ఎందుకు?’ అని ప్రముఖ పర్యావరణ పాత్రికేయురాలు బహర్‌దుత్ పోస్టు చేశారు.
‘హెచ్‌సీయూలో అభివఅద్ధి చెందుతున్న వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తున్నారు. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఈ మట్టిలో 237 పక్షిజాతులు, మచ్చల జింకలు, పాములు ఉన్నాయి. ఇవన్నీ మన వారసత్వం, సంస్కఅతికి చిహ్నాలు’ అని గుంజన్ పోస్ట్ చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం హెచ్‌సీయూలో చేస్తున్న జీవవైవిధ్య విధ్వంసంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు మౌనంగా ఉంది ? సుమోటో కేసుతో చట్టపరమైన చర్యలు తీసుకోండి’ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!