
రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా వైద్య రంగంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు.
యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ సర్జరీ వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటిగ్రేషన్ వంటి అత్యాధునిక వైద్య విధానాలు, ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స తదితర అంశాలపై “హైదరాబాద్ ఆర్త్రోస్కోపీ కాన్క్లేవ్-2025” పేరిట బంజారాహిల్స్ లోని పార్క్ హయత్‌లో ఏర్పాటుచేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్‌ను గవర్నర్ శనివారం ప్రారంభించారు.
ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ వినియోగాన్ని అన్ని రంగాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాధాన్యత ఇటీవల వైద్య రంగంలో బాగా పెరిగిందని ఆయన తెలిపారు. భారతదేశం క్రీడా రంగంలో దూసుకుపోతుందని, స్పోర్ట్స్ గాయాలతో ఇబ్బందులు పడే ఆటగాళ్లకు లేటెస్ట్ చికిత్సలను గుర్తించాలని పేర్కొన్నారు.
ఆర్త్రోస్కోపీపై జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్ లో యువ ఆర్థోపెడిక్ వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ తెలిపారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ ఆర్త్రోస్కోపీ శస్త్రచికిత్సలో అత్యాధునిక పద్ధతులు, పురోగతిపై దృష్టి సారించే ఈ అంతర్జాతీయ సదస్సు , లైవ్ వర్క్ షాప్, మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ప్రాముఖ్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
కీళ్ల సంబంధిత సమస్యలను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగించే మినిమల్లీ ఇన్వాసివ్ సర్జికల్ ప్రక్రియ అయిన ఆర్త్రోస్కోపీ, ఆర్థోపెడిక్ సర్జరీలు చేసే విధానాన్ని విప్లవాత్మకంగా మర్చివేసిందని ఆయన చెప్పారు. అత్యాధునిక రోబోటిక్ సహాయం, ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్, ఇంటిగ్రేషన్ వంటి అత్యాధునిక వైద్య విధానాల ద్వారా అనేక ఆర్థోపెడిక్ సర్జరీలు విజయవంతంగా ఏలా నిర్వహించాలో ఈ సదస్సుకు హాజరైన 600 మందికి పైగా యువ సర్జన్లకు లైవ్ సర్జికల్ వర్క్ షాప్ ద్వారా వివరించడం జరిగిందని వివరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 60 మందికి పైగా ప్రముఖ అంతర్జాతీయ జాతీయ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. యశోద హాస్పిటల్స్ సీనియర్ స్పోర్ట్స్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, డాక్టర్. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి తదితరులు పాల్గొన్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత