ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమి విజయ ఢంకా మోగిస్తోంది. కృష్ణా-గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో ‘కూటమి’ గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమైంది. కృష్ణా-గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు.
ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2,41,544, చెల్లని ఓట్లు 26, 676, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా, ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. 82,319 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా విజయం సాధించారు
ఆలపాటి రాజేంద్రప్రసాద్ తొలి రౌండ్ నుంచి భారీ ఆధిక్యంతో కొనసాగారు. ప్రత్యర్థుల్లో సిటింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించారు.మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన, బలమైన అభ్యర్థిగా మరోమారు ‘కృష్ణా-గుంటూరు’ బరిలోకి దిగిన కేఎస్ లక్ష్మణరావుకు ఘోర పరాజయం ఎదురయింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరించారనే ప్రచారం జరగడంతో పాటు వైసీపీ పరోక్ష మద్దతే ఈ వామపక్షాల అభ్యర్హ్డ్కి ప్రతికూలంగా మారినట్లు భావిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బిజెపి మద్దతు ప్రకటించిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్ నేత రఘువర్మ రెండోస్థానంలో నిలవగా, వైసీపీ పరోక్ష మద్దతు ప్రకటించిన యూటీఎఫ్ అభ్యర్థి విజయగౌరి మూడోస్థానానికి పరిమితమయ్యారు. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానంలో టీడీపీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బిజెపి బలపరిచిన పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఆయన రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. గత నెల 27న జరిగిన పోలింగ్‌లో 20,794 ఓట్లు పోలవ్వగా, అందులో 659 చెల్లనవిగా గుర్తించారు. మిగిలిన 20,135 ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు అదనంగా సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది.
అంటే 10,068 ఓట్లు రావాలి. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో శ్రీనివాసులు నాయుడికి 7,210, ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు 6,845, యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి 5,804 ఓట్లు లభించాయి. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించగా.. శ్రీనివాసులునాయుడికి 9,237 ఓట్లు, వర్మకు 8,527 ఓట్లు లభించాయి.
ఇంకా శ్రీనివాసులునాయుడి ఎన్నికకు 831ఓట్లు అవసరమయ్యాయి. దీంతో రెండో స్థానంలో నిలిచిన రఘువర్మకు లభించిన ఓట్ల నుంచి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 10,068 ఓట్లు రావడంతో శ్రీనివాసులునాయుడిని విజేతగా ప్రకటించారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం