
ఇక వరంగల్‌లో ఏర్పాటు కానున్న మమునూరు ఎయిర్ పోర్ట్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. గద్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే తన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో వేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలంతా తిరిగి తమ సొంత గూటికి వెళ్లేందుకు సిద్దమవుతోన్నారని స్పష్టం చేశారు.
త్రిభాషా సిద్దాంతానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ సిద్దాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 90 శాతం ప్రజలకు ఉర్దూ రాకున్నా తెలంగాణలో బోర్డులపై ఎందుకు ఆ భాషను రాస్తున్నారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎవరికి భయపడి ఉర్దూ భాష రాస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అనుమతి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడరని ఈ సందర్బంగా ఎంపీ రఘునందన్ రావు గుర్తు చేశారు. మరి పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ భాషలో మాట్లాడతారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టిందని పేర్కొంటూ దానికి కేంద్రానికి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.
అయితే కేటీఆర్‌ను అరెస్ట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. రు. అయినా గతంలో ఏసీబీ అరెస్ట్ చేసిన విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారంటూ సీఎం రేవంత్‌కు చురకలంటించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఫీజిబులిటీ ఉంటేనే ఇవ్వాలని పునర్విభజన చట్టంలో ఉందని, కానీ దానికి ఫీజిబులిటీ లేదని తేలిందని ఆయన పేర్కొన్నారు. డిలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాల్సి ఉందని చెప్పారు.
ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పదేళ్లు కావస్తోందని చెబుతూ ఆయన ముఖం చెల్లకే హిందీ భాష, డిలిమిటేషన్ అంశాలతో తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయ్యాలని అనుకొంటున్నారని ధ్వజమెత్తారు. అయితే 2026 చివరలోనే డిలిమిటేషన్ జరిగేదని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు