కాల్పుల్లో హెజ్బుల్లా కమాండర్‌ షేక్‌ హమ్మాదీ మృతి

కాల్పుల్లో హెజ్బుల్లా కమాండర్‌ షేక్‌ హమ్మాదీ మృతి

దుండగులు జరిపిన కాల్పుల్లో సీనియర్‌ హెజ్బుల్లా కమాండర్‌ షేక్‌ హమ్మాదీ మృతి చెందారు. మంగళవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు తూర్పు లెబనాన్‌లో తన నివాసంలో ఉన్న హమ్మాదీపై కాల్పులు జరపారు. దీంతో అతను తన ఇంటి ముందే ప్రాణాలు కోల్పోయాడు.  ఈ విషయాన్ని లెబనీస్‌ వార్తాపత్రిక అల్‌ అఖ్బర్‌ నివేదించింది. దాడి జరిగిన వెంటనే హమ్మాదీని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయాలపాలై వెంటనే మృతి చెందినట్లు అల్‌ అఖ్బర్‌ పత్రిక నివేదించింది.  అయితే అతను చనిపోవడానికి కుటుంబ కలహాలే కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ వీటిపై సరైన స్పష్టత లేదు.  ఇప్పటివరకు ఏ గ్రూపు కూడా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు వెల్లడించలేదు. కాగా, షేక్‌ హమ్మాదీ హిజ్బుల్లా పశ్చిమ అల్‌ బకా ప్రాంతానికి కమాండర్‌గా పనిచేశాడు. 

హమ్మాదీ 1985లో లుఫ్తాన్స ఫ్లైట్‌ 847 వెస్ట్‌ జర్మన్‌ విమానా్ని హైజాక్‌ ేశాడు. అప్పుడు ఈ విమానంలో 153 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో పలువురు అమెరికన్లు ఉన్నారు. హైజాక్‌ అయిన సమయంలో ఓ అమెరికన్‌ జాతీయుడిని చిత్రహింసలకు గురిచేసి చంపారు. దీంతో వాంటెడ్‌ నేరస్తుల జాబితాలో హమ్మాదీ చేరారు.