‘దిల్ రాజు’పై ఐటీ దాడులు

‘దిల్ రాజు’పై ఐటీ దాడులు

హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాదులో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. 

తెలుగు చలనచిత్ర నిర్మాతల నివాసాలపై ఐటి శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై ఐటి సోదాలు జరుగుతున్నాయి. కాగా సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో గేమ్ చెంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసిన విషయం తెలిసిందే. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. 

దిల్‌రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేకచోట్ల ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాలను భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మించారు. 

అలాగే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌ ిత్రానికి‌ డిస్ట్రిబ్యూటర్‌గా దిల్‌రాజు వ్యవహరించారు. మరోవైపు మైత్రీ సంస్థ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. మైత్రీ నవీన్, సిఈవో చెర్రీ, ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.  మైత్రీ సంస్థ ఇటీవలే పుష్ప2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ.18 వందల కోట్లకు పైగా వసూల్ చేసినట్టు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు.