
గత పదేళ్లలో దేశ సైన్యానికి 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘రక్షణ రంగంలో భారత్ ఆత్మ నిర్భరతను సాధిస్తోంది. దేశంలో జరిగిన రక్షణరంగ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ అడుగులు వేస్తోంది’ అని మోదీ తెలిపారు.
నౌకాదళం మరింత బలోపేతం
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకలో ప్రాజెక్ట్ 15ఏ, ప్రాజెక్ట్ 15బీ డెస్ట్రాయర్లు ఉన్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి వెల్లడించారు. ఐఎన్ఎస్ నీల్‌గిరి యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్లు ఉన్నాయని, వీటిని కలిగిన తొలి భారత యుద్దనౌక ఇదేనని చెప్పారు. ఐఎన్ఎస్ వాఘ్‌షీర్ యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 75 జలాంతర్గాములు (సబ్ మెరైన్లు) ఉన్నాయని ేర్కొన్నారు.
ఈ మూడు యుద్ధ నౌకల చేరికతో భారత నౌకాదళం సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని త్రిపాఠి తెలిపారు. హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రయోజనాలను కాపాడే క్రమంలో నౌకాదళం చేపట్టే ఆపరేషన్లకు ఈ యుద్ధ నౌకలు దోహదం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఐఎన్‌ఎస్ సూరత్ ఇది పీ15బి గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేసిన నాలుగో యుద్దనౌక. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్ వార్‌షిప్‌లలో ఒకటి. దీనిని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్‌వర్క్-సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి.
ఐఎన్‌ఎస్ నీలగిరి పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ మొదటి నౌక. దీనిని శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. సముద్రంలో ఎక్కువసేపు ఉండటం దీని సామర్ధ్యం. అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇది తరువాతి తరం స్వదేశీ యుద్ధనౌకలను సూచిస్తుంది.
ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్ పీ75 స్కార్పెన్ ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. జలాంతర్గామి నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ భాగస్వామ్యమైంది. సముద్ర భద్రతలో ఈ యుద్ధనౌక కీలకం కానున్నది.
More Stories
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
ఆసియా కప్ 2025లో పాక్ ను మట్టికరిపించిన భారత్