
సంధ్య థియేటర్ ఘటనను ప్రస్తావిస్తూ ‘‘ఇటీవల జరిగిన పరిస్థితులను చూస్తే. ఇండస్ట్రీలోని వారే కాదు బయట ఉన్నవాళ్లకు కూడా ఒక స్పష్టత వస్తుంది. సినిమా వాళ్లను ఫ్యాన్స్ దేవుళ్లుగా చూస్తారు. దానికి అనుగుణంగా హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కారుల్లో వెళ్లాలి. రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. ఇలాంటివి ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారాయి. అలాకాకుండా సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది” అని తెలిపారు.
గతంలో హీరోలు ఇలా ఉండేవారు కాదని స్పష్టం చేశారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు అభిమానులతో సినిమాలు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. “వారు సైలెంట్‌గా ఏదో ఒక మల్టీప్లెక్స్‌కు వెళ్లేవారు. సినిమా చూసేవారు. బయటకు వచ్చే సమయంలో అక్కడ ఉన్నవారితో కాసేపు మాట్లాడేవారు. ఒకవేళ సింగిల్ స్క్రీన్ థియేటర్‌కు వెళ్లాల్సి వచ్చినా.. ఎవరికీ చెప్పకుండా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి వచ్చేసేవారు” అని చెప్పారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత