
దీంతో కొత్త బిల్లుకు ట్రంప్ మద్దతు తెలపడంతోపాటు దానికి అనుకూలంగా ఓటేయాలని రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. కానీ, ఈ బిల్లును డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించడంతో ఆ బిల్లు 235-174 తేడాతో తిరస్కరణకు గురైంది. ఈ బిల్లును వ్యతిరేకించిన డెమోక్రాట్లకు ఏకంగా 38 మంది రిపబ్లికన్లు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది.
సెనేట్లో కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుండటంతో ఈ బిల్లుకు ఆమోదం లభించడం క్లిష్టంగా మారింది. శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో పార్లమెంట్ విఫలమైతే అమెరికాలో మరోసారి షట్డౌన్ తప్పదని, ఇది ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. గతంలో ట్రంప్ హయాంలో 35 రోజులపాటు షట్డౌన్ కొనసాగిందని గుర్తుచేస్తూ అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘమైన షట్డౌన్ అని పేర్కొంటున్నారు. షట్డౌన్ వల్ల లక్షల మంది ఉద్యోగులకు జీతాలు నిలిచిపోతాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు 8.75 లక్షల మంది ఉద్యోగుల సేవలు ఆగిపోతాయి.
More Stories
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’