
కెనడా-భారత్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో.. వివాదానికి కారణమైన ఖలిస్థానీల గురించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక ప్రకటన చేశారు. ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాలో ఉన్నారని అంగీకరించారు. ఒట్టవాలోని పార్లమెంట్ హిల్‌లో ఇండో కెనడియన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వం ఖలిస్థానీ అతివాదులకు స్వర్గధామంగా ఉందని భారత్ చేసిన ఆరోపణలను పరోక్షంగా అంగీకరిస్తూ కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. ఇటీవల ట్రూడో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు కారణంగానే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
కాగా, ఖలిస్థానీల పట్ల ట్రూడో వైఖరి వారిలో సాధికారిత కల్పిస్తూ, ఆధునిక సిక్కుల్లో భయం పుట్టిస్తున్నదని రెండు రోజుల క్రితం సిక్కు, మాజీ మంత్రి ఉజ్జల్ దోసంజ్ విమర్శించారు.
మరోవంక, కెనడా ప్రభుత్వం తన వీసా పాలసీని సవరించింది. 10 ఏండ్ల పాటు చెల్లుబాటయ్యేలా గతంలో అమలు చేసిన దీర్ఘకాలిక బహుళ ప్రవేశ పర్యాటక వీసాను జారీ చేసే విధానంలో మార్పు చేసింది. కొత్త నిబంధలన ప్రకారం పర్యాటకులకు ఏ విధమైన వీసాను జారీ చేయాలి, దానికి ఎంత గడువు నిర్దేశించాలి అన్న విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులే నిర్ధారిస్తారు. దీంతో ఇకపై 10 ఏండ్ల దీర్ఘకాలపు వీసాల జారీ ఉండకపోవచ్చు.
గతంలో ప్రభుత్వం సింగిల్, మల్టిపుల్ ఎంట్రీ వీసాలు జారీ చేసేది. మల్టిపుల్ ఎంట్రీ వీసాలు కలిగిన వారు ఆ నిర్దేశించిన 10 ఏండ్ల కాలంలో కెనడాకు ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించవచ్చు. ఇలా మల్టిపుల్ వీసా తీసుకుని దేశంలో ఉంటున్న లక్షలాది మంది నివాసితులను దేశం నుంచి పంపే యోచనలో కెనడా ప్రభుత్వం ఉందని వార్తలొస్తున్నాయి.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్