అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని, దాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు భగ్నం చేశారని అమెరికా న్యాయ విభాగం తెలిపింది. ఈ మేరకు మన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టులో ఇరాన్ పౌరుడిపై అభియోగాలను నమోదు చేసింది. ట్రంప్‌తో పాటు ఓ జర్నలిస్ట్‌ను కూడా హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఇద్దరు అమెకరిన్ పౌరులను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది.
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జిసి)కు చెందిన ఫర్జాద్ షకేరీ, ట్రంప్‌ను హత్యకు కుట్ర పన్నినట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొంది. ప్రస్తుతం షకేరీ పరారీలో ఉన్నాడని, ఇరాన్‌లోనే నివసిన్నట్లుగా భావిస్తున్నామని పేర్కొంది. ట్రంప్‌ను చంపడానికి ఒక ప్రణాళికను రూపొందిచమని అక్టోబర్ 7న షకేరీకి ఇరాన్ ఆదేశించినట్లు అభియోగాల్లో తెలిపింది.
ట్రంప్‌తో పాటు ఇరాన్ పాలను విమర్శిస్తూ వార్తలు రాసే అమెరికా జర్నలిస్ట్‌ను కూడా హత్య చేసేందుకు కుట్ర పన్నిట్లు అటార్నీ జనరల్ గార్‌లాండ్ తెలిపారు. రివేరా, లోడ్‌హోల్ట్ అనే ఇద్దరు అమెరికాన్ పౌరులను న్యూయార్క్‌లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఫర్జాద్ షకేరీ ఆదేశాల మేరకు నిందితులిద్దరూ జర్నిలిస్టుపై కొంత కాలంగా నిఘా ఉంచారని వెల్లడించారు.
అమెరికా పౌరులు, జాతీయ భద్రతకు నష్టం కలిగించేలా ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అమలు కానివ్వబోమని చెప్పారు. ట్రంప్, ఇతర ప్రభుత్వ నాయకలుతో పాటు ఇరాన్ పాలనను విరమర్శించే అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుందని అని చెప్పడానికి ఇదే ఉదాహరణగా ఉందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే అన్నారు. అమెరికన్లను హత్యకు చేసేందుకు నిరంతరం ఇరాన్ కుట్రలు చేస్తోందని, దానిని సహించమని తెలిపారు.
అమెరికా ఎన్నికల సమయంలో గందరగోళాన్ని సృష్టించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని యూఎస్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు ట్రంప్ ప్రచార బృందం రెండు నెలల క్రితమే పేర్కొంది. ట్రంప్‌నకు కచ్చితమైన ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది అని తెలిపింది. కొన్ని నెలలుగా ఇరాన్ బెదిరింపులు పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లుగా అప్పుడు ట్రంప్ బృందం తెలిపింది.
More Stories
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు