అత్యంత తీవ్ర రూపాల్లోని క్యాన్సర్‌కు కొత్త చికిత్సా విధానాన్ని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక ప్రకారం బ్రిటన్‌లోని దాదాపు 15 వేల మంది క్యాన్సర్ రోగుల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. వీరిలో 39 రకాల కణుతులు గలవారు ఉన్నారు.
వీరిలో 16 శాతం మందికిపైగా ఎక్స్‌ట్రా క్రోమోజోమల్ డీఎన్‌ఏ (ఈసీడీఎన్‌ఏ) కలవారు ఉన్నారు. కణితి (ట్యూమర్) పెరుగుదలను ప్రేరేపించే, కీమో థెరపీని నిరోధించే బలహీనమైన, అస్థిరమైన డీఎన్‌ఏను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేసే విధానాన్ని గుర్తించారు. చికిత్స చేయడం సంక్లిష్టమైన క్యాన్సర్లలో ఈసీడీఎన్‌ఏ, కొద్దిగా జెనెటిక్ మెటీరియల్ ఉంటాయని కనుగొన్నారు. ఈ ఈసీడీఎన్‌ఏను అరికట్టగలిగే ఔషధాన్ని కూడా ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అత్యంత తీవ్ర రూపాల్లోని క్యాన్సర్‌కు కొత్త చికిత్సా విధానాన్ని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక ప్రకారం.. బ్రిటన్‌లోని దాదాపు 15 వేల మంది క్యాన్సర్ రోగుల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. వీరిలో 39 రకాల కణుతులు గలవారు ఉన్నారు.
వీరిలో 16 శాతం మందికిపైగా ఎక్స్‌ట్రా క్రోమోజోమల్ డీఎన్‌ఏ (ఈసీడీఎన్‌ఏ) కలవారు ఉన్నారు. కణితి (ట్యూమర్) పెరుగుదలను ప్రేరేపించే, కీమో థెరపీని నిరోధించే బలహీనమైన, అస్థిరమైన డీఎన్‌ఏను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేసే విధానాన్ని గుర్తించారు. చికిత్స చేయడం సంక్లిష్టమైన క్యాన్సర్లలో ఈసీడీఎన్‌ఏ, కొద్దిగా జెనెటిక్ మెటీరియల్ ఉంటాయని కనుగొన్నారు. ఈ ఈసీడీఎన్‌ఏను అరికట్టగలిగే ఔషధాన్ని కూడా ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్