
భారతీయ జనతా పార్టీ (బిజెపి) జమ్మూ కాశ్మీర్లో శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యే , మాజీ మంత్రి సునీల్ శర్మను ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరించనున్నారు. శ్రీనగర్‌లోని చర్చి లేన్‌లో జరిగిన పార్టీ శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్‌కు బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనాలతో సహా పార్టీ కీలక ప్రముఖులు హాజరైన ఈ సమావేశంలో, అసెంబ్లీలో పార్టీ నాయకత్వంను బలోపేతం చేయడానికి చేసేందుకు నిర్ణయించారు. నగ్రోటా నుండి ఎన్నికైన ఎమ్మెల్యే దేవిందర్ సింగ్ రాణా గురువారం ఊహించని మరణంతో వివిధ రాజకీయ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు,
పార్టీకి, ఈ ప్రాంతానికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. శర్మ ఈ కీలక పాత్రలోకి అడుగుపెట్టడంతో, అసెంబ్లీలో బిజెపి ప్రయత్నాలకు బలం చేకూర్చడం, అధికార ప్రభుత్వానికి బలమైన ప్రతిపక్షాన్ని అందించడం వంటి బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఇటీవలి రాజకీయ మార్పుల మధ్య జమ్మూ కాశ్మీర్లో పార్టీ తన స్థావరాన్ని బలోపేతం చేయడానికి చూస్తున్నారు.
ఈ స్థానానికి కిష్త్వార్ జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సునీల్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ కాశ్మీర్ శాఖను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు ప్రతిపక్ష ఉపనేతగా నరీందర్ సింగ్ రైనా నియమితులయ్యారు.
ఈ నాయకత్వ మార్పుతో పాటు, 2018 నుండి ఆ పదవిలో కొనసాగుతున్న రవీందర్ రైనా తర్వాత, బిజెపి తన జమ్మూ కాశ్మీర్ యూనిట్‌కు కొత్త అధ్యక్షుడిగా సత్ శర్మను పార్టీ ప్రకటించింది. రైనా ఇప్పుడు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యునిగా వ్యవహరిస్తారు. అసెంబ్లీ మొదటి సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’