
వయస్సు నిర్థారణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని , పుట్టిన తేదీని కేవలం పాఠశాల రికార్డులను అనుసరించే లెక్కలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇందుకు భిన్నంగా ఉన్న పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పును సర్వోత్తమ న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. సాధారణంగా ఇటీవలి కాలంలో ఆధార్‌కార్డులలో పుట్టిన తేదీలకు, రికార్డులలోని వాటికి పొంతన ఉండటం లేదు.
ఇది పలు చిక్కుముళ్లకు దారితీస్తోంది. హర్యానాలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయనకు ఆధార్‌కార్డు లోని పుట్టిన తేదీని బట్టి తక్కువ పరిహారం ప్రకటించారు. అయితే ఇది తప్పుడు పుట్టిన తేదీ అని, వయస్సురీత్యా ఎక్కువ పరిహారం అందాల్సి ఉందని కుటుంబ సభ్యులు హర్యానా కోర్టుకు వెళ్లారు. ఆధార్‌కార్డు రికార్డు ప్రకారం పుట్టిన తేదీ ఖరారు చేసుకోవడం సబబే అని హైకోర్టు తెలిపింది.
ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును మృతుడి బంధువులు ఆశ్రయించారు. స్కూల్ రికార్డులు అంటే స్టడీసర్టిఫికెట్ , పాస్ సర్టిఫికెట్లను పొందుపర్చారు. వీటిలోని పుట్టిన తేదీనే లెక్కలోకి తీసుకోవల్సి ఉంటుందని, ఆధార్‌కార్డును పరిగణనలోకి తీసుకోరాదని జస్టిస్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. పరిహారాన్ని 19 లక్షల రూపాయలకు ఖరారు చేయడం సబబే అని తెలిపారు. ఆధార్‌కార్డు కేవలం మనిషి గుర్తింపు ప్రక్రియకు నిర్థారిత ఆధారం అని, పుట్టిన తేదీకి కాదని , ఈ విషయాన్ని ఏ దశలో అయినా గుర్తుంచుకోవల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
More Stories
ఢిల్లీలో నలుగురు బీహార్ మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం
లోక్‌పాల్ కు ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దుమారం
శబరిమల బంగారం కేసులో కుట్ర?.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం