దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ జిల్లా 19ఏళ్ల యువతి సామూహిక అత్యాచారం కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బాలికను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో బాధితురాలికి, ప్రధాన నిందితుడికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వస్తున్నది.
ఇండియా టుడే కథనం ప్రకారం హత్యకేసులో ప్రధాన నిందితుడు సందీప్ సింగ్ కు బాధితురాలికి మధ్య అనేక పర్యాయాలు ఫోన్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ రికార్డ్స్ ఆధారంగా బాధితురాలు సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్ నుంచి సందీప్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
2019 అక్టోబర్ 13 నుంచి బాధితురాలి గ్రామమైన బూల్గారి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోని చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినట్లు కనుగొన్నారు.
ఈ రెండు ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్ గోయింగ్ కాల్స్, 42 ఇన్కమింగ్ కాల్స్ మొత్తం104 కాల్స్ ఉన్నాయని రికార్డులు చూపిస్తున్నాయని తెలిపారు. ఈ కాల్స్ ను బట్టి బాధితురాలు, ప్రధాన నిందితులు సన్నిహితంగా ఉన్నట్లు పొలిసు అధికారులు నిర్ధారణకు వస్తున్నారు.

More Stories
ఉధంపూర్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
పెల్లెట్ గన్ వాడకంపై దర్యాప్తు కమిటీ మార్పుకు సుప్రీం నిరాకరణ
భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ‘యుద్ధ అభ్యాస్’