
నలభై శాతం వైకల్యం ఉన్నంత మాత్రాన ఆ అభ్యర్థిని ఎంబిబిఎస్‌లో అడ్మిషన్ పొందకుండా అడ్డుకోలేమని మంగళవారం సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా వికలాంగ అభ్యర్థులను అనర్హులుగా చేయడానికో లేదా వారి విద్యా లక్ష్యాలకు ఆటంకం కలిగించే మార్గాలను వెతకడం కంటే వారికి ఎలా సదుపాయం కల్పించాలి, అవకాశాలను ఎలా అందించాలనే దానిపై ప్రైవేట్ రంగం, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం దృష్టి సారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వికలాంగుల అసెస్‌మెంట్ బోర్డులు కేవలం వైకల్యం శాతాన్ని తనిఖీ చేసే ‘మోనోటనస్ ఆటోమేషన్స్’గా పనిచేయకూడదని జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగాకోర్సు పూర్తి చేసే అభ్యర్థి సామర్థ్యానికి వైకల్యం ఆటంకం కలిగిస్తుందో లేదో నిర్ణయించడం వికలాంగ అసెస్‌మెంట్ బోర్డులు పాత్ర అని, వాటికి సంబంధించి బోర్డులు సానుకూలంగా నమోదు చేయాలని కోర్టు పేర్కొంది.
అభ్యర్థి అనర్హుడని బోర్డు నిర్ధారించినట్లయితే బోర్డు తీసుకున్న నిర్ణయానికి గల కారణాలను తప్పక అందించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, నేషనల్ మెడికల్ కమిషన్ సవరించిన నిబంధనలను రూపొందించే అంశం పెండింగ్‌లో ఉంది. జనవరి 25, 2024 నాటి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ వికలాంగ అసెస్‌మెంట్ బోర్డులు పేర్కొన్న సూత్రాలను తప్పనిసరిగా పరిగణించాలి.
మంత్రిత్వశాఖ కమ్యూనికేషన్ సహాయక సాంకేతికతలో పురోగతిని చేర్చడం, నిబంధనలు వికలాంగుల హక్కుల చట్టం లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.వికలాంగ అసెస్‌మెంట్ బోర్డుల ప్రతికూల అభిప్రాయాలను న్యాయ సమీక్ష ద్వారా సవాల్ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వతంత్ర అభిప్రాయాల కోసం న్యాయస్థానాలు అటువంటి కేసులను ప్రధాన వైద్య సంస్థలకు సూచించాల్సి ఉంటుందని సుప్రీం అభిప్రాయపడింది.
More Stories
రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు నిషేధం
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
భారత్ అమ్ములపొదిలో చేరనున్న ధ్వని మిస్సైల్