
తమిళనాడుకు చెందిన అధికార పార్టీకి ఎంపీకి ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఆయన, కుటుంబీకులకు భారీగా జరిమానా విధించింది. విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించిన కేసులో డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్ ఆయన కుటుంబ సభ్యులకు రూ.908కోట్ల జరిమానా విధించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం తెలిపింది.
విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ భారీ జరిమానా విధించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఇక ఫెమా చట్టంలోని 37ఏ సెక్షన్ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో సీజ్ చేసిన రూ.89.19 కోట్ల మొత్తాన్ని జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. ఫెమాలో చట్టంలోని సెక్షన్ 37ఏ ప్రకారం 2020లో సీజ్ చేసిన రూ.89.19 కోట్లను జప్తు చేయాలని, రూ.908 కోట్లు జరిమానా విధించాలని ఆదేశించింది. ఆగస్టు 26న వెల్లడించిన తీర్పు ప్రకారం ఈ జరిమానా విధించినట్లు ఈడీ తెలిపింది.
2021 డిసెంబర్ 1న, డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులు సంబంధిత కంపెనీపై ఫెమాలోని సెక్షన్ 16 కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి 2017లో సింగపూర్‌లోని షెల్ కంపెనీలో రూ.42 కోట్ల పెట్టుబడి పెట్టారని విచారణలో తేలింది. ఈ క్రమంలో ఈడీ చర్యలకు ఉపక్రమించింది.
జగద్రక్షకన్ (76) డీఎంకే టిక్కెట్‌పై అరక్కోణం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. చెన్నై బేస్ట్ అకార్డ్ గ్రూప్‌కు వ్యవస్థాపకుడుగా ఉన్నారు. ఆయనకు సొంతంగా భరత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఉంది. జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులపై సంబంధిత కంపెనీపై ఫెమా ఉల్లంఘన కింద 2021 డిసెంబర్ 1న ఈడీ కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి 2017లో సింగపూర్‌లోని ఒక షెల్ కంపెనీలో రూ.42 కోట్లు వారు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ విచారణలో తేలింది.
More Stories
పదేళ్లలో మూడింతలకు పైగా పెరిగిన రాష్ట్రాల అప్పులు
ఉద్యోగ భద్రత కోసమే హెచ్-1బి వీసాల పై ట్రంప్ కన్నెర్ర
రైల్లో అమ్మే వాటర్ బాటిళ్ల ధర తగ్గింపు