
ఎఫ్-1 రేస్ కార్లకు ఎలాంటి జీవో లేకుండా కేటీఆర్ చెబితే రూ.50 కోట్ల ఇచ్చామని హెచ్ఎండీఏ గ్రోత్ కమిషనర్ అర్వింద్ కుమార్ చెప్పి ఆరు నెలలవుతున్నా కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. దీనిపై రేవంత్ రెడ్డి కేటీఆర్‌తో అమెరికాలో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారేమో తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు.
సంగారెడ్డిలో హర్‌ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్లు మొదటి నుంచి తోడుదొంగల పార్టీలు అని విమర్శించారు. ఈ రెండు పార్టీలు నాణేనికి బొమ్మబొరుసు లాంటివని అభివర్ణించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్మీట్లతో సరిపెడుతున్నాయి తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
తప్పు చేసిన వాడు కొడుకైనా, కుమార్తైనా శిక్షించడానికి వెనుకాడనని ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారని, కానీ ఆయన మనసు ఒప్పలేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేతల్లో ఏమీ చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరు అత్త కొట్టింది కోడలు ఏడ్చింది అన్న చందంగా ఉందని ధ్వజమెత్తారు.
సుంకిశాల కూలిపోయిన విషయంపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్‌కి దమ్ము లేదని రఘనందన్ ఆరోపించారు. పాలకపక్షం నిద్రపోతే ప్రతిపక్ష బాధ్యత బీఆర్ఎస్ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఔటర్ రింగ్‌రోడ్డు వ్యవహారంలో రూ.1000 కోట్లకు నోటీసులిచ్చిన హెచ్ఎండీఏ అధికారి అరవింద్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే