
కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) శనివారం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 30 నుంచి రెండేండ్ల పాటు స్వామినాథన్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా ఉంటారు.
1987 బ్యాచ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన టీవీ సోమనాథన్ ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే వరకూ క్యాబినెట్ సెక్రటేరియట్‌లో ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)’గా విధులు నిర్వర్తిస్తారని కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది.
కేంద్ర ఆర్థికశాఖలో 2019 నుంచి వ్యయ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్న టీవీ సోమనాథన్ 2021లో ఆర్థికశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. నాటి నుంచి బడ్జెట్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాల డిమాండ్లలో సమతుల్యత పాటిస్తూనే బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణకు పెద్ద పీట వేశారు.
1987 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన సోమనాథన్ 2015 ఏప్రిల్ నుంచి 2017 ఆగస్టు వరకూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పని చేశారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ గానూ పని చేశారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం