
రష్యా ఆర్మీలో పనిచేస్తున్న 69 మంది భారతీయుల విడుదల కోసం ఎదురుచూస్తున్నామని భారత విదేశాంగ మంత్రి జైంకర్ తెలిపారు. వారిలో చాలామంది భారత్లోని కొందరు ఏజెంట్లు, మాయగాళ్ల మాటలను నమ్మి అక్కడకు వెళ్లి ఆర్మీలో చిక్కుకుపోయారని ఆయన చెప్పారు.
మోసపు మాటలను నమ్మి రష్యా ఆర్మీలో చేరిన మన దేశ పౌరులను విడిచిపెట్టకపోతే ఆ దేశం నుంచి చవక చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందా? అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
అలా వారిని మోసగించి రష్యాకు పంపిన 19 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. మొత్తం 91 మంది భారతీయులు రష్యా ఆర్మీలో నియమితులయ్యారని, వారిలో ఎనిమిది మంది మరణించగా, 14 మంది ప్రభుత్వ సహకారంతో వెనక్కి వచ్చారని, మిగిలిన 69 మంది పౌరులను రప్పించడానికి కేంద్రం కృషి చేస్తున్నదని చెప్పారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు