
టాలీవుడ్ నటి, వైసీపీ మద్దతుదారు శ్రీరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, వంగలపూడి అనితలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది.
సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యపై కర్నూలు టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కర్నూలు మూడో పట్టణ పోలీసుల శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో త్వరలోనే శ్రీరెడ్డిని విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు అంటున్నారు.
టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కించపరిచే విధంగా శ్రీరెడ్డి మాట్లాడారని, ఇది ఏ మాత్రం సమంజసం కాదని, విషపు ఆలోచనలు ఉన్నవారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారని రాజు యాదవ్ మండిపడ్డారు. ఈమెను ఆదర్శంగా చేసుకుని మిగిలిన వాళ్లు కూడా ఇలా మాట్లాడే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అందుకే శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా ఎన్నికల ముందు ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు నమోదయ్యింది. ఈ కేసు వ్యవహారంపై ఇంతవరకూ శ్రీరెడ్డి మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎక్కడా స్పందించలేదు. ఆమె గత కొన్నేళ్లుగా టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలు.. అధినేతలపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదలైన తిట్ల వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమె నోటికి అడ్డు అదుపూ లేకుండా మాటలు వచ్చేస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీ కార్యకర్తలు తిట్టిపోస్తూనే ఉన్నారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు