
ఉన్నవాటిని కూల్చడం, మళ్లీ కొత్తగా నిర్మించడం వంటివి ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు తెచ్చిపెడతాయని భావించారు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్‌హెచ్‌ఏఐకు అటు మెట్రోకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని సూత్రప్రాయంగా సీఎం ఆ సమీక్షలో తెలియజేశారు. ప్రస్తుతం విశాఖలో 12 ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్ రూపొందించింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించడం తప్ప మరే పనీ జరగలేదు. 2017లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది. 2018లోనే అర్హత కలిగిన 5 నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపగా ఎస్సెల్ ఇన్‌ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. ప్రాజెక్టు పట్టాలెక్కే సమయంలో ఎన్నికలు రావడం తరువాత పరిణామాలతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది.
2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గతంలో పిలిచిన టెండర్లతో పాటు డీపీఆర్‌ను రద్దు చేసి మళ్లీ కొత్తగా చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మొదటిగా స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల కారిడార్ నిర్మించి ఆ తర్వాత, భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ పెరిగే సమయానికి మిగిలిన మార్గాన్ని విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
More Stories
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం
జీఎస్టీ సంస్కరణలకు ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం