
* సుస్థిరాభివృద్ధిలో అగ్రగామిగా కేరళ, ఉత్తరాఖండ్
పేదరికం నిర్మూలనలో తెలంగాణ (91 స్కోర్), ఏపీ (86 స్కోర్)తో రెండు, మూడో స్థానంల్లో నిలిచాయి. ఆకలి సూచి (జీరో హంగర్)లో ఏపీ 67 స్కోర్‌తో పదో స్థానంలో నిలిచింది. తెలంగాణ 58 స్కోర్‌తో దారుణంగా ఉంది. ఆరోగ్యంలో ఏపీ 78 స్కోర్‌తో ఆరో స్థానంలో ఉండగా, తెలంగాణ 73 స్కోర్‌తో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
నాణ్యమైన విద్యాలో ఏపీ 52 స్కోర్‌తో 15వ స్థానంలో అత్యంత దారుణంగా ఉండగా, తెలంగాణ మాత్రం 64 స్కోర్‌తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. లింగ సమానత్వంలో ఏపీ 51 స్కోర్‌తో 12వ స్థానంలో ఉండగా, తెలంగాణ 49 స్కోర్‌తో 13వ స్థానంలో నిలిచింది. మంచినీరు, పారిశుద్యంలో ఏపీ 91 స్కోర్‌తో 8వ స్థానంలో ఉండగా, తెలంగాణ 90 స్కోర్‌తో 9వ స్థానంలో నిలిచింది.
సరసమైన, క్లీన్ ఎనర్జీలో ఏపీ, తెలంగాణలు 100 స్కోర్‌తో అగ్రగామిగా నిలిచాయి. మంచి పని విధానం, ఆర్థిక వృద్ధిలో ఏపీ 69 స్కోర్‌తో పదో స్థానంలో ఉండగా, తెలంగాణ 84 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచింది. పరిశ్రమలు, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాల్లో ఏపీ 49 స్కోర్‌తో 14వ స్థానంలో ఉండగా, తెలంగాణ 60 స్కోర్‌తో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
అసమానతల తగ్గుదలలో ఏపీ 67 స్కోర్‌తో 12వ స్థానంలో ఉండగా, తెలంగాణ 65 స్కోర్‌తో 14వ స్థానంలో నిలిచింది. స్థిరమైన నగరాలు, కమ్యూనిటీల్లో ఏపీ 85 స్కోర్‌తో ఆరో స్థానంలో ఉండగా, తెలంగాణ 86 స్కోర్‌తో ఐదో స్థానంలో నిలిచింది. వినియోగం, ఉత్పత్తిలో ఏపీ 93 స్కోర్‌తో నాలుగో స్థానంలో ఉండగా, తెలంగాణ 75 స్కోర్‌తో 13వ స్థానంలో నిలిచింది. వాతావరణ చర్యలలో ఏపీ 70 స్కోర్‌తో ఏడో స్థానంలో ఉండగా, తెలంగాణ 59 స్కోర్‌తో 14వ స్థానంలో నిలిచింది.
బ్లూ వాటర్ (సముద్రం, మెరైన్ వనరులు)లో ఏపీ 95 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇందులో సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలే ఉన్నాయి. అటవీ భూమిని కాపాడుటం (లైఫ్ ఆన్ ల్యాండ్)లో ఏపీ 77 స్కోర్‌తో 11వ స్థానంలో ఉండగా, తెలంగాణ 82 స్కోర్‌తో ఏడో స్థానంలో నిలిచింది. శాంతి, న్యాయం, బలమైన సంస్థలల్లో ఏపీ 79 స్కోర్‌తో ఎనిమిదో స్థానంలో ఉండగా, తెలంగాణ 67 స్కోర్‌తో 17వ స్థానంలో నిలిచింది.
కాగా, ఉత్తరాఖండ్, కేరళ అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా నిలిచాయి. బీహార్ పనితీరు అధ్వాన్నంగా నిలిచింది. కేరళ, ఉత్తరాఖండ్ 79 స్కోర్‌తో అగ్రగామిగా నిలిచాయి. తమిళనాడు 78 స్కోర్ సాధించి రెండో స్థానంలో ఉంది. గోవా 77 స్కోర్‌తో మూడో స్థానంలో ఉంది. అలాగే బీహార్ 57 స్కోర్, జార్ఖండ్ 62 స్కోర్, నాగాలాండ్ 63 స్కోర్, మేఘాలయ 63 స్కోర్‌తో అట్టడుగున ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్, జమ్మూకాశ్మీర్, పుదుచ్చేరి, అండమాన్ నికోబర్ దీవులు, ఢిల్లీ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
ఇండియా 71 స్కోర్‌ను నమోదు చేసుకుంది. అందులో లింగ సమానత్వంలో 49 స్కోర్ నమోదు అయింది. అలాగే ఆకలిలో 52 స్కోర్ వచ్చింది. ఈ రెండు విభాగాల్లోనే అత్యంత తక్కువ స్కోర్ నమోదు అయ్యాయి. ఎస్డీజీ కింద నిర్దేశించిన 16 లక్ష్యాలలో ఇండియా గణనీయమైన మెరుగుదలను సాధించడంలో మెరుగుపడిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సబ్రహ్మణ్యం తెలిపారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!