వస్తువులు, సేవల పన్ను(జిఎస్ టి) మండలి జూన్ 22 న సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఈ ఏడాది తొలి సమావేశం కానున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. ఈ 53వ జిఎస్ టి కౌన్సిల్ సమావేశం జూన్ 22న న్యూఢిల్లీలో జరుగనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
జిఎస్ టి కౌన్సిల్ సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి సమావేశం కావల్సి ఉంటుంది. కానీ 2022 నుంచి ఇప్పటి వరకు కేవలం ఆరు సార్లే సమావేశం అయింది. జరుగనున్న జిఎస్ టి కౌన్సిల్ సమావేశం ఏజెండా ఏమిటన్నది తెలియలేదు. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రులు కొన్ని పరోక్ష పన్నులను కేంద్ర బడ్జెట్ లో చేర్చాలని కోరవచ్చని అనుకుంటున్నారు.
బెట్టింగ్ వాటి మీద జిఎస్ టి 28 శాతం వేయడం వల్ల జిఎస్ టి ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఆన్ లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలు వంటి వాటిమీద అధిక జిఎస్ టి విధించబడుతోంది. గుర్రపు పందేలాడేవారికి జిఎస్ టి తో పాటు ఎంట్రీ ఫీజు కూడా గణనీయంగానే ఉంది. హైదరాబాద్ లో ఆఫ్ కోర్సు టోట్ ఎంట్రీ ఫీజు రూ. 150 వరకు ఉంది. ఇక రేస్ కోర్స్ మెయిన్ ఎంట్రీ ఫీజయితే దీనికంటే రెట్టింపు ఉంటుంది.

More Stories
రూ.20,804 కోట్లతో 8 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు
కర్నాటక మంత్రి సతీశ్, ఎంపీ ప్రియాంకా ఇంట్లో ఈడీ సోదాలు
పొదుపు కంటే వేగంగా పెరుగుతున్న మధ్య తరగతి కుటుంబాల అప్పులు