ఏపీ ఎన్నికల్లో అధికార వైసిపి ఘోర పరాజయంకు గురైన తీరు ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నది. ఆయన ఏర్పర్చుకున్న బలమైన వోట్ బ్యాంకులు సహితం కుప్పకూలిపోవడంతోనే ఇటువంటి పరాజయం ఎదురై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీలను ఆకట్టుకొని, వాటిని ఓటుబ్యాంక్ గా మార్చుకునేందుకు ఆయన తాపత్రయ పడడంతో ఆ వర్గాల విశ్వాసాన్ని పొందలేక పోవడమే కాకుండా, దాని కారణంగా ఆయనకు మద్దతుగా ఉన్న ఇతర వర్గాలను దూరం చేసేందుకు కూడా దారితీసిన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారంలో జగన్ వారిపై మితిమీరిన ప్రేమ ఒలకబోయడం కూడా మిగిలిన వర్గాల అసంతృప్తి, ఆగ్రహానికి కారణం అయ్యాయని వెల్లడవుతుంది. బిజెపి మద్దతుతో పోటీచేస్తున్న టిడిపి అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండవని, 4 శాతం రిజర్వేషన్లు రద్దుచేస్తారని చేసిన ప్రచారం వికటించినట్లు కనిపిస్తున్నది.
వైసీపీ 7 సీట్లు మైనార్టీ అభ్యర్థులకు కేటాయించింది. అయితే వైసీపీ తరపున జగన్ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన వాళ్ళందరి పట్ల ముస్లింలలో సహితం సానుకూల భవనాలు లేకపోవడంతో వారెవ్వరూ గెలుపొందలేక పోయారు. ఉప ముఖ్యమంత్రి నుండి జనంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు, అక్రమాలకు పాల్పడిన విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ వరకు తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న వారిని ఎంపిక చేయడంతో ఫలితాలు తిరగబడక తప్పలేదు.
విజయవాడ, గుంటూరులలో అభ్యర్థుల మీద స్థానిక ముస్లిం ఓటర్లలో కూడా వ్యతిరేకత ఉంది. ఐదేళ్ల పాలనలో అధికారం అడ్డం పెట్టుకొని సొంత సామాజిక వర్గం వారిని కూడా వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి.ఇక ఎన్నికల సమయంలో జగన్ మైనార్టీల మీద చూపించిన ఆసక్తి మిగిలిన వర్గాల అసంతృప్తికి కారణం అయ్యింది. విజయవాడలో సంఖ్య పరంగా ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్న చోట మైనార్టీలకు కేటాయించడం ఆ వర్గం ఓటర్లను దూరం చేసిందని చెబుతున్నారు. దీంతో పాటు బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీ రిజర్వేషన్లు ఉండవని, తాను ఇస్తానంటూ అవసరానికి మించి వైసీపీ శిబిరం ప్రచారం చేసింది.

మైనార్టీలను ఆకట్టుకోడానికి జగన్ చేసిన ప్రకటనలు మిగిలిన వర్గాలను అప్రమత్తం అయ్యేలా చేసింది. చివరకు వైసిపి శ్రేణులకు సహితం వెగటు పుట్టించే విధంగా చేసింది. నా ఎస్సీ, నా ఎఫస్టీలు, నా మైనార్టీలు అంటూ నమ్మబలికే ప్రయత్నం చేసినా జనం నమ్మలేదు. లితంగా ఘోర పరాజయం మూటగట్టుకున్నట్లయింది.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ