మంత్రికి వత్తాసు పలికారని కడప పోలీసులకు చార్జ్ మెమోలు 

మంత్రికి వత్తాసు పలికారని కడప పోలీసులకు చార్జ్ మెమోలు 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ సందర్బంగా జరిగిన గొడవల కారణంగా వైసీపీకి అండగా నిలిచిన అధికారుల మీద వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, చంద్రగిరి సంఘటనపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ పలు జిల్లాల్లో పోలీసు అధికారులపై వేటు వేసింది. అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసు అధికారులు అందరిపై వేటు వేశారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని గౌస్ నగరలో ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్లదాడి చేసుకున్న వ్యవహారంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అగ్రహం వ్యక్తం. విధుల్లో ఉన్న సీఐతో సహ ఐదు మంది ఎస్ఐ లకు చార్జ్ మెమోలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడం వలనే రాళ్ల దాడులు జరిగిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు ఆలీఖాన్, రఫీ, ఎర్రన్న, తిరుపాల్ నాయక్, రంగస్వామిలకు చార్జ్ మెమోలు పంపించారు. కడపలో ఇంత మంది పోలీసు అధికారులకు చార్జ్ మొమోలు జారీ చెయ్యడం కలకలం రేపుతోంది.  మే 13వ తేదీ కడప నగరంలోని గౌస్ నగర్ లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆ సందర్బంలో సామాన్య ప్రజలు సైతం భయంతో పరుగులు తీశారు. గొడవలు జరిగిన తరువాత గౌస్ నగరలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నారు.
 
 రాళ్ల దాడులు జరిగే సమయంలో మంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులు వైసీసీ కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ రాళ్ల దాడిలో అనేక మందికి గాయాలు కావడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. గొడవలకు కారణం అయిన పోలీసుల అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేసిన ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అందిరిని వివరణ కోరారు. ఈ వ్యవహారంపై వైసీపీ నాయకులకు వత్తాసు పలికిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది.