
ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ వైసీపీ తన దౌర్జన్యాన్ని ప్రదర్శించింది. అధికార మదం, ఓటమి భయంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టించింది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చాలా పోలింగ్ బూతుల్లో అల్లర్లు, అరాచకాలు సృష్టించింది. ఓటర్లను వైసీపీ మూకలు భయ భ్రాంతులకు గురి చేసి దాడులకు తెగబడ్డారు. ఈ సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికార వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హింసకు పాల్పడిన్నట్లు ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేసేందుకు వైసీపీ కుట్ర చేసిన్నట్లు ఫిర్యాదులో బీజేపీ నేతలు పేర్కొన్నారు. వైసీపీ చర్యలతో చాలామంది ఓటర్లు ఓటు వేయకుండానే ఇళ్లకు వెళ్లాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార వైసీపీ తమ గూండాలతో అరాచకాలు, గూండాయిజం, హింస ద్వారా ప్రజాస్వామ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు పన్నినట్లు ఈసీ దృష్టికి బీజేపీ నేతలు తీసుకెళ్లారు.
పోలీసుల నిర్లక్ష్యం, ఓటింగ్ మందగమనం వల్లే వైఎస్సార్సీపీ ఘోర పరాజయాన్ని చూసి గూండాలు, అరాచకాలతో ఎన్నికల్లో గెలవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలు పెద్దఎత్తున ఓటు వేయడానికి వచ్చి భారీగా క్యూల్లో నిలబడ్డారన, వైసీపీ అరాచకాలు, హింసాత్మక ఘటనలు కారణంగా ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘వైసీపీ వ్యవహారం ప్రజాస్వామ్యం పట్ల ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వీడియోలు, ఫొటోలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఎన్డీఏ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లపై దాడులతో పాటు సాధారణ ఓటర్లపై భయంకరమైన హింసాత్మక దాడులు చేస్తున్నారు” అని సోమవారం ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లాలో పదికి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లపై వైసీపీ గూండాలు లాఠీచార్జి చేయడంతో చాలా పోలింగ్ బూతులు రక్తపాతాన్ని తలపించాయని చెప్పారు. ఆదివారం రాత్రి మాచర్ల నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు హత్యకు గురైనప్పటికీ ఎలాంటి పోలీసు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఎన్డీఏ కార్యకర్తలపై దాడులు జరిగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలుపై దాడి జరిగిందని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక, పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్‌ను సోమవారం ఉదయం కిడ్నాప్ చేశారని, తాడిపత్రిలో పోలింగ్ ఏజెంట్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరించారని, ప్రకాశం జిల్లా దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ లను స్వాధీనం చేసుకున్నారని వివరించారు
“దర్శి అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్తపై హత్యాయత్నం జరిగింది. శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి గొండు శంకర్ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తుండగా వైసీపీ గూండాలు దాడి చేశారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌లను జగన్ పార్టీ గూండాలు కబ్జా చేశారు” అని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ బూత్‌లను కబ్జా చేస్తూ ఎన్డీయే అభ్యర్థులపై వైసీపీ గూండాలు దాడులకు తెగబడ్డారని, పోలింగ్ ఏజెంట్లను బెదిరించడంతోపాటు ఓటర్లపైనా దాడులు చేశారని తెలిపారు. ఈ హింసాత్మక చర్యలన్నీ పోలీసు రక్షణలో జరిగాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు కోరారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్