
కాంగ్రెస్ రాజ్యంగాన్ని మార్చాలని కోరుకుంటోందని, దళితులు, ఓబీసీ కోటాలను కత్తిరించి వాటిని జిహాది ఓటు బ్యాంక్‌కు పంచాలని కుయుక్తులు పన్నుతోందని మోదీ దుయ్యబట్టారు. విపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకోవని, ఓట్ల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడమే వాటికి తెలిసిన మార్గమని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని రాతపూర్వకంగా ఇవ్వాలని సవాల్ విసిరారు. దేశానికి హామీ ఇవ్వండి.. రాతపూర్వకంగా హామీ ఇవ్వండి. ఎందుకంటే వారిని మనం నమ్మలేం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని ప్రకటించాలని సవాల్ విసిరారు. ఎస్సీ,ఎస్టీ, ఓబిసి, జనరల్ కేటగిరీ రిజర్వేషన్‌లను ఎప్పటికీ తాకబోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు మోదీ.
పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్-దుర్గాపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ… రాహుల్ వయనాడ్‌లో ఓటమి పాలవుతారని తాను చెప్పానని, అందుకే రెండో స్ధానం కోసం వెతుకులాట చేపట్టి రాయ్‌బరేలి నుంచి బరిలో నిలిచారని ఎద్దేవా చేశారు. ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ప్రధాని ఆరోపించారు.
ఇవాళ రాహుల్‌కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్.. భాగో మత్ అని ప్రధాని అన్నారు. భయపడవద్దు.. పారిపోవద్దు అని మోదీ పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారును రాహుల్ పదేపదే విమర్శించారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలతో దాడు చేస్తున్నట్లు ఆయన ఆరోపిస్తూ.. ఎవరూ భయపడవద్దు అంటూ పేర్కొన్నారు.
అయితే రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యలను ఇప్పుడు ఆయనకే ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ విమర్శలు చేశారు. సోనియా గాంధీని కూడా ఆయన వదల్లేదు. తల్లీకొడుకులు ఇద్దరూ తమ స్థానాన్ని వదలివేసి పారిపోయినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీకి చెందిన పెద్ద నేత కూడా పోటీ చేయదని చెప్పానని, ఆమె భయంతో పారిపోయారని, రాజస్థాన్‌కు వెళ్లి రాజ్యసభ నుంచి పోటీ చేశారని మోదీ అన్నారు.
వయనాడ్‌లో కూడా రాహుల్ ఓటమి ఖరారు అవుతుందని, ఓటింగ్ ముగిసిన తర్వాత రాహుల్ మూడవ సీటు గురించి ప్రయత్నం మొదలుపెడుతారని, అమేథీలో ఓటమి భయం వల్ల.. రాయ్‌బరేలీకి వెళ్లారని, భయపడవద్దు అంటూ దేశం అంతా తిరుగుతూ చెబుతున్న ఆ నేతలకు తానో విషయాన్ని చెప్పాలని భావిస్తున్నానని, మీరెవరూ భయపడవద్దు అని, ఎవరూ పారిపోవద్దు అని కాంగ్రెస్ నేతకు మోదీ కౌంటర్ ఇచ్చారు.
More Stories
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు