
కాంగ్రెస్ పార్టీకి తాజాగా రూ.1,745 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందింది. ఇంతకు ముందు ఇప్పుడు కొత్తగా అందిన ఈ ఐటి నోటీసులతో కాంగ్రెస్ పార్టీ చెల్లించాల్సిన మొత్తం ఆదాయపు పన్నుల మొత్తం (టాక్స్ డిమాండ్) రూ 3567 కోట్లకు చేరుకుంది. అసలుకే కష్టకాలంలో ఉన్న తమకు ఇప్పుడు ఈ తాజా ఐటి నోటీసు కూడా అందిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి.
ఇప్పుడు అందిన ఐటి నోటీసు 2014- 15 నుంచి 2016-17 అసెస్మెంట్ ఇయర్స్ కాలానికి సంబంధించింది. ఓ వైపు తమ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేస్తున్నారని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పార్టీ పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న దశలోనే ఇప్పుడు తాజాగా ఈ ఐటి నోటీసు అందింది. రాజకీయ పార్టీలకు ఐటి విభాగం పన్ను మినహాయింపుల ప్రక్రియను నిలిపివేసింది. ఈ క్రమంలో పార్టీకి మొత్తం వసూళ్లకు సంబంధించి పన్నులు విధించినట్లు తెలిపారు.
ఇప్పుడు కొత్తగా వెలువరించిన నోటీసులో ఏ పన్ను మదింపు సంవత్సరానికి ఎంత మొత్తం ఐటి విధించారనేది గణాంకాలతో వెల్లడించారు. దీని మేరకు కాంగ్రెస్ పార్టీ 2014-15 సంవత్సరానికి రూ 663 కోట్లు, 2015-16 సంవత్సరానికి దాదాపుగా రూ 664 కోట్లు, కాగా 2016-17 సంవత్సరానికి రూ 417 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వెరశి మొత్తం ఈ కాలంలో ఐటి నోటీసు డిమాండ్ విలువ రూ.1745 కోట్లకు చేరగా, ఇప్పటివరకూ ఐటి పన్ను మొత్తం రూ 3567 కోట్లకు పడగలెత్తింది.
ఇక కాంగ్రెస్ పార్టీ నేతల నివాసాలలో జరిపిన సోదాల క్రమంలో స్వాధీనపర్చుకున్న పలు డైరీలను నిశితంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డైరీలలో థర్ట్పార్టీ ఎంట్రీలు ఉన్నట్లు నిర్థారించారు. దీనితో వీటిపై కూడా పన్నులు వేశారు. కాగా తమకు ఐటి శాఖ నుంచి రూ 1823 కోట్ల టాక్స్ డిమాండ్ జారీ అయిందని, ఈ మేరకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆదాయపు పన్ను శాఖ తమ పార్టీ ఖాతాల నుంచి ఇప్పటికే రూ 135 కోట్లు రాబట్టుకుందని, అంతకు ముందటి చెల్లింపుల పద్దులో వీటిని లాక్కుంటున్నట్లు తెలిపారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐటి శాఖ నుంచి నోటీసులు, రూ 135 కోట్ల మేర టాక్స్ డిమాండ్ గురించి పార్టీ కోర్టును ఆశ్రయించింది. సోమవారం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ విషయంలో ఐటి అప్పీలేట్ ట్రిబ్యునల్లో ఎటువంటి ఉపశమనం దక్కకపోవడంతో కాంగ్రెస్ వర్గాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ