
ఈ ఆరోపణలపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి స్పందిస్తూ బీజేపీ ఆరోపణలను ఖండించారు. దేవాలయాల నుంచి వసూలు చేసే సొమ్ము ప్రభుత్వం తీసుకోదని, దానిని ధార్మిక పరిషత్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని వెల్లడించారు.
బీజేపీ కూడా తన హయాంలో ఇలాగే చేసిందని, రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఆదాయమున్న దేవాలయాల నుంచి 5 శాతం బీజేపీ ప్రభుత్వం వసూలు చేసిందని, రూ. 25 లక్షలకు పైబడి ఆదాయమున్న ఆలయాల నుంచి పది శాతం వసూలు చేసిందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అర్చకుల అభ్యున్నతి, సీ గ్రేడ్ ఆలయాల అభ్యున్నతి, అర్చకుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం లాంటి పనులు ధార్మిక పరిషత్ ముఖ్య ఉద్దేశాలని మంత్రి సెలవిచ్చారు.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన హిందూ ధార్మిక సంస్థలు, ధార్మిక ధర్మాదాయ బిల్లుపై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా తన దిగజారుడుతనాన్ని బయటపెట్టుకున్నదని ఆరోపించారు. రాహుల్ దిగజారుడుతనానికి ఈ బిల్లు ఒక మచ్చుతునక అని పేర్కొన్నారు.
డీకే శివకుమార్, సిద్ధరామయ్యల నేతృత్వంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మతపరమైన ఎండోమెంట్ బిల్లును తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. ఆలయాల నిర్వహణ కోసం హిందూ భక్తులు ఇస్తున్న విరాళాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుంటున్నదని ఆరోపించారు. హిందూ భక్తుల సొమ్మును కర్ణాటక కాంగ్రెస్ కొల్లగొడుతున్నదన్న చంద్రశేఖర్.. కాంగ్రెస్‌కు ఇది ఏటీఎం మిషన్ అని విమర్శించారు.
కాగా, ఈ బిల్లు న్యాయ సంబంధ సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లును `మత స్వాతంత్య్రం’కు భంగం కలిగిస్తుందనే విమర్శలు చెలరేగుతున్నాయి. మరోవంక, కర్ణాటకలో విశేష ప్రాబల్యం గల ధార్మిక సంస్థలు, పీఠాలతో ప్రభుత్వ సంబంధాలు సహితం దెబ్బతింనేందుకు దారితీయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా