బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతి ఇతరులకు ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. `ఉద్యోగాలకోసం భూమి’  కేసులో విచారణకు ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. 
లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలున్న మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది.  ఈ కేసులో రబ్రీ దేవి, హేమా యాదవ్, మిసా భారతి, అమిత్ కత్యాలీ, హృదయానంద్ చౌదరి, తదితరుల పేర్లను తొలి చార్జిషీట్లో ఈడీ పేర్కొంది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన లాలూ, ఆయన కుటుంబం వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలో నిందితులు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని కోర్టు భావించింది. ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ శనివారం సమన్లు జారీ చేసింది. కాగా, ఒకవైపు బీహార్‌లో రాజకీయ గందరగోళం నెలకొన్న తరుణంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబానికి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
                            
                        
	                    
More Stories
రూ.7,500 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు
డిజిటల్ అరెస్టు కేసుల్లో కఠినంగా వ్యవహరించాలి
టాటా ట్రస్ట్స్ పై న్యాయపోరాటంకు మెహ్లీ మిస్త్రీ