జగన్ సర్కార్ అంగన్వాడీల ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది. ఎస్మా చట్టం ప్రయోగించినా వినకపోయే సరికి.. డైరెక్ట్ గా విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. దీనిపై ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సోమవారం ఉదయం లోగా విధులకు హాజరుకాని వారిని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు సర్కారు ఉత్తర్వులు అందాయి.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విధులకు హాజరుకాని అంగన్వాడీల జాబితాను సైతం రూపొందించారు. వారందరికీ టెర్మినేషన్ లెటర్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న 1,444 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 931 ఆయాలను తొలగిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రకటించారు. అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,734 మందికి పల్నాడు జిల్లాలో 1,358 మందిని తొలగిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటనలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 వేల మంది అంగన్వాడీలు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఉద్యమం తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక విపక్షాలు సైతం అంగన్వాడీల విషయంలో జగన్ సర్కార్ అ వలంభిస్తున్న ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయినా సర్కార్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. విధుల నుంచి తొలగించాక రెండు రోజుల్లోనే ఖాళీల సంఖ్య ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. 26 న ఆన్ లైన్ లోనే ధరఖాస్తులు స్వీకరించనున్నారు.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి
విశాఖలో కంటైనర్ మెగా పోర్టు..నీతి ఆయోగ్