
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయేషా మీరా తల్లి తండ్రులు దాఖలు చేసిన పిటీషన్‌తో.. ఏపీ హైకోర్టు సీబీఐకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ వివరాలను తమకు అందజేయాలంటూ సీబీఐ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆయేషా హత్య జరిగి 15 ఏళ్ళు దాటినా కేసు దర్యాఫ్తులో పురోగతి లేదంటూ ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా, 2007 డిసెంబర్ 27 న ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అనుమానాస్పద రీతిలో హత్యకు గురైంది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ, నేటి వరకు అసలు నిందితులు దొరకక పోవటంతో మిస్టరీ కొనసాగుతోంది.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు