
కాటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల దబ్బాకున్నా గ్రామ శివార్లలోని కొండపై ఉన్న నక్సలైట్లను ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు భద్రతా సిబ్బంది చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని, బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ చెప్పారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైనట్లు తెలిపారు.
నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సమయంలో భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం ఆ ప్రాంతంలో ఉందని ఆయన చెప్పారు. ఆ సమయంలో నక్సలైట్తో ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్ర పోలీసు, జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), బస్తర్ ఫైటర్స్లోని రెండు విభాగాల సిబ్బంది ఆపరేషన్ను ప్రారంభించారని సుందర్రాజ్ పి చెప్పారు. ఈ ఆపరేషన్ దంతెవాడ-సుక్మా అంతర్ జిల్లా సరిహద్దులోని తుమ్క్పాల్ పోలీస్ క్యాంపు నుంచి దబ్బకున్న వైపు సాగుతోంది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్