తెలంగాణలో విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు

తెలంగాణలో విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విద్యా సంస్థలకు అధికారులు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా.. బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈమేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు.

ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని సంస్థలు సెలవు ఇవ్వాని ఆదేశించారు.  సెలవు ఇవ్వని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఎన్నికల వేళ (2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ) కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు సీఈవో తెలిపారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

 
ఇదిలా ఉంటే.. మూడు రోజుల పాటు వైన్స్ బంద్‌ చేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 30 తారీఖు 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు.