
అధికారంలోకి రాగానే.. భాగ్యనగరం అని హైదరాబాద్ పేరు మారుస్తామని కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. మద్రాస్ చెన్నైగా, కలకత్తాను కోల్ కతాగా మార్చినపుడు, బాంబే పేరు ముంబైగా మార్చినపుడు హైదరాబాద్ పేరు మార్చడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
రాజ్ పథ్ను కర్తవ్యపథ్ గా మార్చామన చెబుతూ ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నాని స్పష్టం చేశారు. బానిస మనస్తత్వానికి ప్రతీకలను తొలగించి ప్రజల ఆత్మగౌరవానికి అనుగుణంగా పేర్లు తీసుకురావడం తప్పేం లేదని తేల్చి చెప్పారు. ముస్లింలపై తమకు కోపం లేదని, వారి సంక్షేమం జరగాలనేదే తమ ఆలోచన అని తెలిపారు.
అయితే, ముస్లింలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న మజ్లిస్ పార్టీపైనే కోపం ఉందని పేర్కొన్నారు. కాగా, రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. వర్తమానంలో జరిగే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేయడం, చేయాలని బీజేపీ అడడదని స్పష్టం చేశారు. కిసాన్ సమ్మాన్ నిధిని విజయవంతంగా రైతుల ఖాతాల్లో వేశామని, అదే సమయంలో వివాదాలకు ఎక్కడా తావు ఇవ్వలేదని గుర్తు చేశారు.
`నేను కొట్టనట్లు చేస్తా..నువ్వు ఏడ్చినట్లు నటించ’మన్నట్టు రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే, సకాలంలో రైతులకు రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే, నోటిఫికేషన్ కు ఒకరోజు ముందే చెల్లించి ఉండేవారని చెప్పారు.
హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితబంధు ఇస్తామని డ్రామాలు ఆడి ఎన్జీవోలతో ఫిర్యాదు చేయించుకున్నారని గుర్తు చేస్తూ నేరుగా గెలిచే సత్తాలేకుండా ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న కేసీఆర్ ఓడిపోతున్నాడనే విషయం ఆయనకు, వాళ్ల పార్టీకి అర్థమైందని చెబుతూ ప్రజలు అనుకుంటే ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఈసారి బీఆర్ఎస్ పీడ విరగడ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు