అణు దాడి చేస్తామన్న ఇజ్రాయిల్ మంత్రి తొలగింపు

అణు దాడి చేస్తామన్న ఇజ్రాయిల్ మంత్రి తొలగింపు

గత నెల రోజులుగా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్‌ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. గాజాపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ని ఆదేశించారు. అదే సమయంలో అణుబాంబు దాడిపై వ్యాఖ్యలు చేసిన మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొలగించారు. సమావేశంలో అణుదాడిపై చర్చించాలని ప్రతిపాదించినందుకు సస్పెండ్‌ చేశారు.

ఇజ్రాయెల్ అణు విధానంపై ప్రభుత్వంలో భాగమైన రైట్‌ ఓట్జ్మా యెహుదిత్ పార్టీకి చెందిన మంత్రి ఎలియాహుపై చర్యలు చేపట్టారు. హమాస్‌ పాలిత గాజా స్ట్రిప్‌పై అణుబాంబు దాడి ఓ ఎంపిక అని పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు పెంచిన నేపథ్యంలో అణుబాంబు వేసే అవకాశం ఉందా? అని మంత్రిని ప్రశ్నించగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

యుద్ధ నిర్ణ‌యాల‌ను తీసుకునేందుకు ఏర్పాటైన కేబినెట్ భ‌ద్ర‌తా క‌మిటీలో తాను స‌భ్యుడిని కాద‌ని, అయితే గాజాపై అణుబాంబును ప్ర‌యోగించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌కోవైపు గాజాపై భూత‌ల దాడులు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 2500 హ‌మాస్ టార్గెట్స్‌ను ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేసింద‌ని ఐడీఎఫ్ వెల్ల‌డించింది.

అయితే, గాజా స్ట్రిప్‌పై అణుబాంబు వేసే అవ‌కాశాల‌ను కూడా ఇజ్రాయెల్ ప‌రిశీలిస్తుంద‌ని ఇజ్రాయిలీ మంత్రి అమిహై ఎలియ‌హు ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్యాఖ్యలపై పాలక, ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తమయ్యాయి. దాంతో ఆయనను తొలగించాలనే డిమాండ్‌ వ్యక్తమయ్యాయి.  పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎలియాహు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

ఈ సందర్భంగా నెతన్యాహు స్పందిస్తూ అమాయకులకు హానితలపెట్టని రీతిలో అత్యున్న అంత‌ర్జాతీయ చ‌ట్ట ప్రమాణాల‌కు అనుగుణంగా ఇజ్రాయెల్‌, ఐడీఎఫ్ వ్యవ‌హ‌రిస్తున్నాయని స్పష్టం చేశారు. హ‌మాస్‌పై విజయం సాధించే వరకు దాడులు కొన‌సాగుతాయ‌ని పీఎంఓ ఓ ప్రకటన ప్రకటనలో తెలిపింది. ఎలియాహు భద్రతా క్యాబినెట్‌లో మంత్రి భాగం కాదని, ఇస్లామిస్ట్ హమాస్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని నిర్దేశించే మంత్రిత్వశాఖపై అతని ప్రభావం లేదని తెలిపింది.