
అయోధ్యలో నిర్మించనున్న రామమందిర డిజైన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇవాళ సమావేశం అయిన అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ రామాలయ ప్రతిపాదిత మ్యాప్‌కు ఓకే చెప్పేసింది. ఆలయ నిర్మాణ నక్షకు ఏకపక్షంగా ఆమోదం దక్కింది. అయోధ్య బోర్డు చైర్మన్ ఎంపీ అగర్వాల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆగస్టు 29వ తేదీన రామాలయ మాస్టన్ ప్లాన్‌ను అయోధ్య డెవలప్మెంట్ బోర్డుకు సమర్పించింది. మొత్తం 274110 చదరపు మీటర్లతో రామమందిర మాస్టర్ ప్లాన్‌లో ఓపెన్ ఏరియా ఉన్నది. 1300 చదరపు మీటర్లలో కేవలం రామ మందిరాన్ని నిర్మించనున్నారు.
కేవలం 1300 చ.మీటర్ల స్థలంలో మాత్రమే రాముడి ప్రధాన ఆలయం ఉంటుంది. డెవలప్మెంట్ రుసుము, మెయింటేనెన్స్ రుసుము, సూపర్‌విజన్, లేబర్ సిస్తును ట్రస్టు చెల్లించాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ రుసుము కింద సుమారు రూ 5 కోట్లు బోర్డుకు కట్టాల్సి ఉంటుంది.
అయితే బోర్డుకు డబ్బులు చెల్లించిన తర్వాతనే అప్రూవ్ అయిన ఆలయ నక్షను ట్రస్టుకు అందజేస్తారు. ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిరం కోసం భూమిపూజ చేసిన విషయం తెలిసిందే.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్