తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇదీ..

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇదీ..

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సీఈసీ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ను ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 30 న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

3-నవంబర్ : నొటిఫికేషన్

10-నవంబర్ : నామినేషన్ల స్వీకరణ

13-నవంబర్ : నామినేషన్ల పరిశీలన

15-నవంబర్ : నామినేషన్ల ఉపసంహరణ

30-నవంబర్ : ఎన్నికలు

3-డిసెంబర్ : కౌంటింగ్

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389 మంది ఉన్నట్లు సీఈసీ పేర్కొంది. ఇక తెలంగాణలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 35,356 ఉండగా.. 27,798 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక ఎన్నికల కోసం 72 వేల బ్యాలెట్ యూనిట్లు, 57వేల కంట్రోల్ యూనిట్లు, 56 వేల వీవీప్యాట్ యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్షలు. ఇక 80 ఏళ్లు పైబడినవారు 4.43 లక్షలు ఉన్నారని.. 80 ఏళ్లు దాటిన ఓటర్లకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.