
సోవియట్ యూనియన్ పతనం కావడానికి ఏడాది ముందు అంటే 1990 తర్వాత రష్యా అణు విస్పోటన పరీక్షలను నిర్వహించింది లేదు. అయితే అణు పరీక్షలను తిరిగి చేపట్టే అవకాశాన్ని పుతిన్ తోసిపుచ్చలేదు. అణు పరీక్షలను రద్దు చేసే ఒడంబడికకు అమెరికా ఆమోదం తెలుపలేదని, కానీ రష్యా మాత్రం ఆమోదించడానికి తోడు సదరు ఒడంబడికపై సంతకం కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఆమోదాన్ని రద్దు చేసే అవకాశం రష్యా పార్లమెంట్ డ్యూమాకు ఉందని తెలిపారు. గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన తరుణంలో రష్యా లేదా అమెరికా లేదా ఉభయ దేశాలు అణు విస్ఫోటన పరీక్షలను పునరుద్ధరించిన పక్షంలో అది అంతర్జాతీయంగా అస్థిరతకు దారి తీస్తుందనే ఆందోళనను మిలటరీ అధ్యయనవేత్తలు వ్యక్తం చేశారు.
ఇరు పక్షాలకు అణ్వాయుధాలను మోహరింపజేయడంలో సంఖ్యను పరిమితం చేసే న్యూ స్టార్ట్ ఒడంబడికలో రష్యా భాగస్వామ్యాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో పుతిన్ రద్దు చేశారు. అయితే అణ్వాయుధాల వాస్తవిక వినియోగంపై ఒక శాసనాన్ని తిరిగరాసే అవసరం రష్యాకు లేదని పుతిన్ తెలిపారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి