
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తాజాగా గన్ మెన్ పై చేయిచేసుకొని వార్తల్లో నిలిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు మహమూద్ అలీ బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసి, ఆయనపై చేయి చేసుకోవడం కలకలం రేపింది.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభమైంది. ఇందులో మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక అమీర్ పేటలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని ప్రారంభించారు.
అయితే ఇవాళ తలసాని జన్మదినం కావటంతో హోంమంత్రి శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా బోకే గురించి తన వెనక ఉన్న సెక్యూరిటీ గార్డు సిబ్బందిని అడిగారు. బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో క్షణాల వ్యవధిలోనే హోంమంత్రి సహనం కోల్పోయారు. సెక్యూరిటీ గార్డు చెంపపై కొట్టారు.
దీంతో అక్కడున్న వారంతా షాక్ కాగా మంత్రి తలసాని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో షాక్ అయిన సదరు గన్ మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. ఆపై వెనక ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన ఫై నెటిజన్లు మంత్రి మహమూద్ అలీ విమర్శలు చేస్తున్నారు. మంత్రి అయినంత మాత్రాన సిబ్బంది ఫై చేయి చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి