బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!

బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు పాదాభివందనం చేశారు.  చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన సంబరాలలో ఈ సంఘటన జరిగింది. వందలాది మంది బీజేపీ మహిళా కార్యకర్తలు, నేతలు ఈ వేడుకలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.

మరోవైపు ఈ వేడుకలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. ఆయనను కొందరు మహిళలు సన్మానించారు. ఈ క్రమంలోనే వారికి ఆయన పాదాభివందనం చేశారు. అదే సమయంలో తన కాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను మోదీ ఆపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.

ఆ సమయంలో ఆ ప్రాంగణం అంతా ‘జై మోదీ.. జై బీజేపీ’ నినాదాలతో మారుమోగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి వందన్ అధినియన్గా పిలుస్తోంది కేంద్రం. లోక్సభ, రాజ్యసభలో ఈ బిల్లు గట్టేక్కింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లులు చట్టంగా మారుతుంది. బిల్లు ఆమోదం నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ.

“మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినందుకు దేశంలోని నారీ శక్తికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో కొత్త చరిత్రను రాశాము. ఇలా చరిత్ర రాసేందుకు ప్రజలు మనకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది” అని తెలిపారు.  “దేశ భవిష్యత్తునే మార్చేయగలిగే శక్తి కొన్ని నిర్ణయాలకు ఉంటుంది. అలాంటిద ఇది! ఇలాంటి బిల్లు పార్లమెంట్లో గట్టెక్కడం దేశంలో మెజారిటీ కలిగిన ప్రభుత్వం సత్తాను చాటిచెబుతుంది. దేశాభివృద్ధికి మెజారిటీ కలిగిన ప్రభుత్వం ఉండటం ఎంత అవసరమో ఈ బిల్లు చెబుతోంది,” అని ప్రధాని చెప్పారు.