
మహిళలు ఛాతీ నొప్పియే కాకుండా వాంతులు, దవడ నొప్పి, పొత్తి కడుపు నొప్పి వంటి అదనపు లక్షణాలతో బాధపడుతున్నారని పరిశోధకులు ఈ అధ్యయనంలో గుర్తించారు. గుండెజబ్బులను గుర్తించడం, చికిత్సలో పురుషులకు, మహిళలకు మధ్య విపరీతమైన వ్యత్యాసం కనిపించిందని గర్లెనబీ తెలిపారు.
జర్నల్ ఆర్టీరియోస్క్లెరోసిస్, థ్రాంబోసిస్, వాస్కులర్ బయాలజీ లో ఈ విశ్లేషణ వెలువడింది. ముఖ్యంగా యువతుల్లో గుండెపోటు శాతాలు మరీ పెరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు 1995 నుంచి 2014 మధ్య కాలంలో 35 నుంచి 54 ఏళ్ల మహిళల్లో గుండెపోటు సంఘటనలు 21 నుంచి 31 శాతం వరకు పెరిగాయని అధ్యయనం ఉదహరించింది.
ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని గర్లెనబీ ఆందోళన వెలిబుచ్చారు. గర్భిణిగా ఉన్న సమయంలో ముందుగా నెలసరి ఆగిపోవడం, లేదా భారీగా రుతుస్రావం జరగడం, రక్తపోటు రుగ్మతలు రిస్కు ఫ్యాక్టర్స్‌గా పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విశ్లేషణ దాదాపు 2.3 మిలియన్ ప్రజల అనుభవాలతో ముడిపడి ఉందని పరిశోధకులు వివరించారు.
More Stories
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా
శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల కలర్ ఫొటో!