వార్షిక సగటు వర్షాపాతంలో 70 శాతం రుతుపవనాల సమయంలోనే నమోదు అవుతుండడం గమనార్హం. వర్షపాతం తగ్గితే నిత్యావసర చక్కెర, పప్పులు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో 1972 తర్వాత ఆగస్టులో తెలంగాణలో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. ఆగస్టులో కేవలం 74.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కాగా, ఇది సాధారణం కంటే 60 శాతం తక్కువ. 1960 నుంచి రాష్ట్రంలో ఇంత తక్కువగా వర్షపాతం నమోదవడం ఇది మూడోసారి. 1960లో 67.9 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదవగా, 1968లో 42.7 మిల్లీమీటర్లు, 1972లో 83.2 మిల్లీమీటర్లు, ప్రస్తుతం ఆగస్టులో 74.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది.
సాధారణంగా తెలంగాణలో 120 రోజులు వర్షాకాలం ఉంటుందని, 60-70 రోజులు మంచి వర్షాలు కురుస్తాయని.. మిగతా రోజుల్లో అడపదడపా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో జూన్‌లో లోటు ఏర్పడిందని, జులైలో మంచి వర్షాలు కురిసినా ఆగస్టులో వరుణుడు ముఖం చేశాడు. లోటు వర్షపాతానికి ఎల్ నినో ప్రధాన కారణమని నిపుణులు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Stories
సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల పాగా!
మాటలతో యుద్ధాలు గెలవలేం.. పాక్ కు సిడిఎస్ చురకలు
కాంగ్రెస్ ప్రశ్నించిన వంటారాతోనే రేవంత్ ఒప్పందం!