
శ్రీనగర్ లాల్‌చౌక్ లోని ఘంగా ఘర్‌గా ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక క్లాక్‌టవర్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఐరోపా నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ క్లాక్‌టవర్‌ను గత ఏడెనిమిది నెలలుగా పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. శ్రీనగర్‌లో పారిస్‌ను తాము సందర్శించగలమని వ్యాపారులు ఆశిస్తున్నారు.
ఈ నెలలోనే ఈ నిర్మాణ పనులు పూర్తి కాగలవని ఆశిస్తున్నట్టు లాల్ చౌక్ ట్రేడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుహాయిల్ షా పేర్కొన్నారు. ఆగస్టు 15 తరువాత కొత్త లాల్‌చౌక్‌ను చూడగలమని ఎస్‌ఎంసి కమిషనర్, స్మార్ట్ సిటీ సిఇఒ అధర్ అమీర్ ఖాన్ హామీ ఇచ్చారని తెలిపారు.
నగరంలోని పోలో వ్యూ మార్కెట్ తర్వాత మరో అందమైన పర్యాటక ప్రాంతంగా ఘంగా ఘర్ రూపొందుతుందని మరో సిటీ ప్రెసిడెంట్ సాడియా అభిప్రాయపడ్డారు. శ్రీనగర్‌లో ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రాంతాల్లో లాల్‌చౌక్ ఒకటని, కేంద్ర వాణిజ్యం, వ్యాపారాల కూడలి అని తెలిపారు.
పోలో వ్యూ మార్కెట్‌ను ఎలా అభివృద్ధి చేశామో దీన్ని కూడా అదే విధంగా డిజైన్ చేశామని అదర్ అమీర్‌ఖాన్ చెప్పారు. చాలా మంది టూరిస్టులు, స్థానికులు ఇక్కడకు వచ్చి సాయంత్రం వరకు గడుపుతుంటారని, డాల్ లేక్, నిషాత్ విధంగా మొత్తం లాల్ చౌక్‌ను టూరిస్ట్ హబ్‌గా మార్చాలన్నదే తమ లక్షంగా పేర్కొన్నారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్