
తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి, డిఎంకె నాయకుడు కె పొన్ముడి, ఆయన కుమారుడు డిఎంకె ఎంపి గౌతమ్ సింగమనికి చెందిన ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) సోమవారం ఉదయం మనీ లాండరింగ్ కేసులో దాడులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. చెన్నై, విల్లుపురంలోని తండ్రీకుమారుదలిద్దరికీ చెందిన ప్రాంగణాలలోఇడి దాడులు కొనసాగుతున్నట్లు వర్గాలు తెలిపాయి.
72 సంతవ్సరాల మంత్రి పొన్ముడి విల్లుపురం జిల్లాలోని తిరుక్కోయిలూరు అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుందగా ఆయన కుమారుడు 49 సంవత్సరాల సింగమణి కల్లకురిచి లోక్సభ నియోజవకర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2007 నుంచి 2011 వరకు పొన్ముడి రాష్ట్ర మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇడి ఈ దాడులు నిర్వహించింది. క్వారీ లైసెన్సు మంజూరుకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 28 కోట్ల నష్టం జరిగినుట్ల ఆరోపణలు నమోదయ్యాయి.
పొన్ముడిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. కాగా ఈ కేసు నుంచి ఉపశమనం కోరుతూ సింగమణి దాఖలు చేసిన పిటిషన్పై స్టే ఇవ్వడానికి జూన్లో హైకోర్టు నిరాకరించింది. కాగా, రాజకీయ వేధింపులలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ దాడులకు పాల్పడుతుందని డీఎంకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ