
ఈ సర్వేలో 18-24 ఏళ్ల మధ్య వయసున్న వారు 19 శాతం ఉన్నారు. 25-34 ఏళ్ల మధ్య వయసున్న వారు 33 శాతం పాల్గొన్నారు. 35-44 ఏళ్ల మధ్య 27%, 45-54 ఏళ్ల మధ్య వయసున్న 14%, 55-64 ఏళ్ల మధ్య వయసున్న 5%, 65 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు 2% ఉన్నారు. అన్ని వయో వర్గాల మహిళలు సర్వేలో భాగమయ్యారు.
వైవాహిక స్థితి పరంగా 70% మంది వివాహితులు, 24% అవివాహితులు, 3% వితంతువులు, 3% విడాకులు తీసుకున్నవారు తమ అభిప్రాయాలు తెలియజేశారు. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 11% పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీలు, 27% గ్రాడ్యుయేట్లు, 21% మంది 12వ తరగతి వరకు పూర్తి చేసినవారు ఉన్నారు.
14% మంది 10వ తరగతి వరకు విద్యను పూర్తి చేసినవారు, 13% మంది 5-10వ తరగతి వరకు చదివినవారు తమ అభిప్రాయాలు తెలియజేశారు. 4% మంది 5వ తరగతి వరకు చదివిన వారు ఉన్నారు. 4% మంది నిరక్షరాస్యులు, 4% ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యాలను కలిగి ఉన్నారు. మతపరంగా చూస్తే.. 73% మంది సున్నీలు, 13% మంది షియాలు ఉన్నారు. 14% మంది ముస్లిం కమ్యూనిటీలోని ఇతర వర్గాలకు చెందినవారు.
సమాన వారసత్వం, వారసత్వ హక్కుల కోసం ముస్లిం మహిళల నుంచి లభించిన మద్దతు, ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను తెలుపుతోంది. మగ వారసులకు అనుకూలంగా ఉండే నిబంధనలు, నియమాలను విశ్వవ్యాప్తంగా ఆమోదిస్తున్నారనే ఊహను సర్వే ఫలితాలు సవాలు చేస్తున్నాయి. ఇది ముస్లిం స్త్రీలలో, ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం, చిన్న వయస్సు వర్గాల నుంచి లింగ సమానత్వం కోసం పెరుగుతున్న అవగాహన, డిమాండ్‌ను వెల్లడి చేస్తుంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు