A view of Punjabi students staging a protest against deportation in Canada.
కెనడాలోని 700 మంది భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం తాత్కాలిక ఊరటను కల్పించింది. అక్రమ వీసాలు, పత్రాల కారణంగా ముందు వీరిని భారత్‌కు పంపించివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కెనడా అధికార యంత్రాంగం వాయిదా వేసింది. భారత ప్రభుత్వం ఈ విషయంలో కెనడా ఇమిగ్రేషన్ అధికారులతో, భారత్‌లోని కెనడా దౌత్య అధికారులతో మాట్లాడిన తరువాత పంపివేత నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కకు పెట్టారు. దీనితో పంజాబ్‌కు చెందిన పలువురు విద్యార్థులు ఊరట చెందారు.
భారత్ కు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ శనివారం స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధం అయిన దశలో కెనడా ప్రభుత్వ నిర్ణయం గురించి తెలియడంతో తన క్యాంపస్ హాస్టల్‌కు వెళ్లాడు. ఇప్పటికైతే తనకు మంచి జరిగింది కానీ ఇది ఎంతకాలం ఉంటుందో అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. అత్యధికంగా పంజాబ్‌కు చెందిన విద్యార్థులను కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు మోసగించి కెనడాలో ఉన్నత చదువులకు తీసుకువెళ్లాయి.
అయితే వారు సమర్పించిన పత్రాలు కెనడా ఇమిగ్రేషన్ నిబంధనల పరిధిలో లేవని తేలడంతో విద్యా సంవత్సరం మధ్య దశలో లేదా ఆరంభ దశలో ఉన్న వీరు తమ భవితకు గండిపడుతోందని మానసిక వ్యథకు గురయ్యారు. ఈ క్రమంలో వెలువడ్డ బ్రేక్‌తో ఇక్కడి భారతీయ పంజాబీ యువతలో సంబరాలు నెలకొన్నాయి.
2017-2018 మధ్యలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు కెనడాలో చదువులకు వెళ్లారు, ఆరేడు ఏండ్ల క్రితం కెనడాకు వెళ్లిన వారు కూడా కొన్ని కన్సల్టెన్సీల మోసానికి గురయ్యారు. అక్రమ పత్రాలు నిర్ధారణ అయితే కెనడాకు వెళ్లిన భారతీయులు పంపివేతకు గురికాక తప్పదు.

More Stories
బంగ్లాదేశ్‌లో సజీవ దహనం నుండి తప్పించుకున్న మరో హిందూ
ఉగ్రవాదలతో పాకిస్థాన్ సంబంధాలు బట్టబయలు
రష్యా న్యూఇయర్ వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 24 మంది మృతి